గాన కోకిల లతా మంగేష్కర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందనే చెప్పాలి. ఎంతోమంది సంగీత అభిమానులు లతాజీ మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే లతాజీ మృతి తర్వాత అందరిని తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి. సుమారు రెండు వందల కోట్ల ఆస్తులకు లతాజీ యజమానురాలు. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఆస్తులను అనుభవించడానికి ఆమెకు వారసులు లేరు. ఎందుకంటె ఆమె వివాహం చేసుకోలేదు, కనీసం జయలలిత లాగా వారసులను దత్తత తీసుకోలేదు. దీంతో ఇప్పుడు లతా వీలునామాలో ఆ ఆస్తులను ఎవరి పేరుమీద రాశారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
కొన్నిరోజుల్లో లతాజీ లాయర్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఆస్తులన్నీ లతాజీ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలకు చెందనున్నాయంట. లతాజీ తన తండ్రి పేరుతో ఒక ట్రస్ట్ ని నడుపుతున్నారు. ఆ ట్రస్ట్ కే ఆమె ఆస్తులన్నీ వెళ్లనున్నాయట. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక లతాజీ తోబుట్టువులకు, వారి వారసులకు ఆ ఆస్తి చెందుతుందా..? లేదా..? అనేది కూడా చూడాలి.