అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు. Also Read:Kannappa Trailer Review…
2025 ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరివరకు జరిగిన ఉత్కంతపోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింటా ముగ్గుర్ని ఎలిమినేటి చేసేందుకు సిద్దమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు? వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది? వచ్చే వేలంలో అనుసరించాలని వ్యూహాలపై ప్రీతి ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటుందట.…
సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్…
అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ, మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశాడని, దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు. Also Read : Flight Crash: విమానంలో…
హీరోయిజం అంటే కేవలం తెరమీద ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేయడమే కాదు.. తెర వెనుక కూడా చేయాలి. అప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఇలా తెరమీద.. తెర వెనుక కూడా హీరోలుగా మారే మనస్తత్వాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏదైనా పని అనుకుంటే చేసి తీరాలి అనే పట్టుదల ఆయనకు ఎక్కువ. అలాగే సాటి మనిషి…
ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించిన తరుణంలో, సిజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, ఈ సినిమా నిన్నటికి రిలీజ్ కావాల్సి ఉంది, కానీ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను వచ్చే నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు? ఈ సినిమాను…
రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా ఆయన నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. Also Read: OTT Movie : ఓటీటీలోకి ‘DD…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే…