హీరోయిజం అంటే కేవలం తెరమీద ఆపదలో ఉన్న వారిని కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేయడమే కాదు.. తెర వెనుక కూడా చేయాలి. అప్పుడే వారు నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఇలా తెరమీద.. తెర వెనుక కూడా హీరోలుగా మారే మనస్తత్వాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏదైనా పని అనుకుంటే చేసి తీరాలి అనే పట్టుదల ఆయనకు ఎక్కువ. అలాగే సాటి మనిషి సాయపడడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో కూడా చాలా స్పీడ్ గా స్పందిస్తారు. ఇలా ఆపదలో ఉన్న వారిని కాపాడే విషయంలో పవన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోయలోకి పరుగులు పెట్టి వారిని కాపాడిన సంఘటన పవన్ కల్యాణ్ లోని నిజమైన హీరోని వెలుగులోకి తెచ్చింది.
Also Read:Hari Hara Veeramallu: ఆ రోజునే హరిహర వీరమల్లు?
అది ‘తొలిప్రేమ’ షూటింగ్ జరుగుతున్న రోజులు. ఆ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే యాక్సిడెంట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. సీన్ ప్రకారం హీరో, హీరోయిన్లు లోయలో పడిపోతారు. ఈ సీన్ షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సన్నివేశానికి సంబంధించిన అన్ని క్లోజ్ షాట్స్ పవన్-కీర్తిరెడ్డిలపై చిత్రీకరించారు. ఇక మిగిలింది హీరో, హీరోయిన్ల కారు లోయలో పడిపోయే షాట్. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సహజంగా అప్పట్లో పవన్ తన షాట్స్ అయిపోయినా కూడా సెట్లోనే ఉంటూ ఇతరులపై చేస్తున్న షాట్స్ అవి గమనిస్తూ ఉండేవారు. అందువలన పవన్ కూడా అక్కడే ఉన్నారు. పవన్-కీర్తిరెడ్డిల డూప్లను కార్ లో కూర్చోబెట్టారు. కారుకు బిగించిన రోప్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు దర్శకుడు కరుణాకరన్. షాట్ కోసం కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు కెమెరామెన్ చోటా కె. నాయుడు. యాక్షన్ చెప్పగా సీన్ షూట్ స్టార్ట్ అయ్యింది.
Also Read:Pawan Kalyan: ఇక్రిశాట్ స్కూల్ లో మార్క్ శంకర్ అడ్మిషన్!
అయితే అనూహ్యంగా కారుకు కట్టిన రోప్ తెగిపోయి కారు లోయలోకి పడిపోయింది. అంతే యూనిట్ మొత్తం షాక్. అంతా అరుపులు, కేకలతో అల్లకల్లోలంగా మారిపోయింది. కెమెరా లెన్స్ నుంచి సీన్ షూట్ చేస్తున్న చోటా కె. నాయుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని తన పక్కనే ఉన్న కూర్చొని ఉన్న పవన్ కల్యాణ్కు ఏదో చెప్పబోయారు. తీరా చూస్తే అప్పటి వరకూ తన పక్కనే కూర్చుని కబుర్లు చెబుతున్న పవన్ అక్కడ లేడు. కంగారుగా చుట్టూ చూశాడు చోటా. దూరంగా కనిపించే దృశ్యం చూసి చోటా షాక్. పవన్ పిచ్చిపట్టిన వాడిలా లోయలోకి పరుగు పెడుతున్నాడు. అప్పుడు అర్థమైంది.. సీన్ గమనిస్తున్న పవన్ రోప్ తెగిపోయిన మరుక్షణం అందులో డూప్ జంటను కాపాడటానికి మిగిలిన యూనిట్ సభ్యుల కన్నా వేగంగా స్పందించారని. “ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పవన్ ని నిజమైన హీరోయిజాన్ని ఆరోజు నేను కళ్లారా చూశాను” అని గుర్తు చేసుకుంటారు చోటా కె. నాయుడు ఇప్పటికీ.
*సేకరణ*