మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది.. మే 12న బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట.. కలెక్షన్ల వేట మొదలు కాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో ప్యారిస్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. దాంతో ఇంకా మహేష్ ప్యారిస్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు మహేష్.. సర్కారు వారి పాట ప్రమోషన్స్ స్టార్ట్ చేసే సమయం రానే వచ్చేసింది. ఈనెల 7న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ అవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ లోపు మహేష్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి జోరుగా ప్రచారం చేయబోతున్నారు మహేష్. దాంతో మహేష్ బాబు రాక కోసం వెయిటింగ్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాట కోసం అసలు సిసలైన పని మొదలు పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో అదరగొట్టిన తమన్.. ఇప్పుడు బిజీఎమ్ కోసం రంగంలోకి దిగాడు. ఈ మధ్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ హవా జోరుగా నడుస్తోంది. అఖండ, భీమ్లా నాయక్ సినిమాల పాటల కంటే.. బిజీఎమ్‌తోనే థియేటర్ బాక్సులు బద్దలు చేశాడు తమన్. అలాగే రాధే శ్యామ్, డిజే టిల్లు.. సినిమాలకు బిజీఎమ్ అందించి అదరహో అనిపించుకున్నాడు. ఇప్పుడు సర్కారు వారి పాటపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నట్టు.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన టీమ్ తో కలిసి 24/7 సౌండ్ మిక్సింగ్ పై వర్క్ చేస్తున్నట్లు థమన్ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ‘సర్కారు వారి పాట’ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.