”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత.
టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్‌తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ భామ. పవన్ కల్యాణ్‌తో ”అత్తారింటికి దారేది’, మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’, జూనియర్ ఎన్టీఆర్ తో ”రభస”, మంచు విష్ణుతో ”పాండవులు పాండవులు తుమ్మెద”, రామ్‌తో ”హలో గురు ప్రేమకోసమే” చిత్రాలతో అలరించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలకు సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. గతేడాది ”హంగామా2”, ”భూజ్” సినిమాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె కన్నడలో నటిస్తున్న ”రామణ అవాతార” చిత్రం షూటింగ్ దశలో ఉంది.