Peamante : కమెడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది నటిస్తోంది. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. నవంబర్ 21న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు బాగానే ఆకట్టుకుంటుఎన్నాయి. ఇక తాజాగా మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి తరువాత భార్యాభర్తలు ఎలా ఉండాలి అని అనుకుంటారు.. ఎలా ఉంటారు అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది.
Read Also : Prashanth Varma : అవన్నీ ఫేక్ న్యూస్ : ప్రశాంత్ వర్మ
ప్రతి సంసారంలో ఉండే సమస్యలనే ఈ సినిమాలో చూపించారు. ఇందులో ప్రియదర్శి, ఆనంది భార్య, భర్తలుగా తమ సమస్యలతో నలిగిపోయే పాత్రల్లో బాగానే నటించినట్టు కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలానే వచ్చినా.. ఇందులో ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు కొన్ని సీన్లను డిజైన్ చేశారంట. ఈ సినిమాలో భార్య, భర్తల మధ్య వచ్చే సమస్యలను ఎలా ఫేస్ చేయాలి.. అందరూ ఎలాంటి సమస్యలు పడుతుంటారు.. గొడవలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి అనేది ఇందులో చూపించారు.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్