తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసారు. తెలుగు అకాడమీ కేసులో నేడు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో ఈరోజు…
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో 10 మందిని అరెస్ట్ చేశాము అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ద్వారా సెప్టెంబర్ 27 తేదీన మాకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో మూడు కేసులు పై FiR లు నమోదు చేసి విచారణ చేశాము. 64.50 కోట్లు వరకు నిధులు గోల్ మాల్ జరిగింది. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు దఫాదఫాలుగా నిధులను డ్రా చేసినట్లు విచారణ లో తేలింది.…
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ స్కాం లో తవ్విన కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ స్కాం కు సంబంధించి ఆరుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రమేష్ ని కూడా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా నివేదిక సమర్పించింది. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిధుల గోల్మాల్ జరిగిందని కమిటీ తేల్చింది. అంతేకాకుండా ఉన్నతాధికారుల…
తెలుగు అకాడమీ కేసులో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు గా పోలీసుల విచారణలో బయట పడింది. ముగ్గురు దొరికితే కానీ అసలు రహస్యం బట్టబయలు కాదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్వలి కి ఈ ముగ్గురు సహకరించినట్లు గా విచారణలో వెలుగుచూసింది. రాజకుమార్, శ్రీనివాసు, సోమ శేఖర్ లు ఈ కేసులో కీలకంగా ఉన్నారని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. మస్తాన్వలి నిధులను డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఈ…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై ఈ నెల 18న బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు ఏపీ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి.. ఈ నెల 21 న కార్వాన్ యూబీఐ బ్యాంక్ నుండి రూ.24 కోట్లు విత్ డ్రా కు రఫిక్ అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని పంపించారు.. అయితే, మస్తాన్‌వలి అనుచరుడిగా రఫీక్ తో పరిచయం…
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు.. తెలుగు అకాడమీలో మొత్తం రూ.63.47 కోట్లను నగదు రూపంలో విత్ డ్రా చేశారు.. ఆ ముగ్గురు నిందితులు.. ఇన్నవో కారులో ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు డబ్బులు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. డబ్బులు కొల్లగొట్టడంలో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్.. సహకరించినట్టు…