తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో 10 మందిని అరెస్ట్ చేశాము అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ద్వారా సెప్టెంబర్ 27 తేదీన మాకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో మూడు కేసులు పై FiR లు నమోదు చేసి విచారణ చేశాము. 64.50 కోట్లు వరకు నిధులు గోల్ మాల్ జరిగింది. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు దఫాదఫాలుగా నిధులను డ్రా చేసినట్లు విచారణ లో తేలింది. తెలుగు అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ సెగూరి రమేష్ , చందా నగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట కోటి సాయి కుమార్ ను అరెస్ట్ చేశాము. సాయి కుమార్ ప్రమేయం ఈ కేసులో చాలా కీలకంగా ఉంది, మూడు కేసులు అతని పై ఉన్నట్లు విచారణ లో తేలింది. 2015 ఏపీ హోసింగ్ బోర్డ్ స్కామ్ లో అతను గతంలో సిఐడి విచారణ చేసింది. 25 కోట్లు మోసం కేసులో చైన్నై పొలుసులు అరెస్ట్ చేశారు అని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.