Yadagirigutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
శనివారం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ఐసీఏఈ)ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ఇందులో ప్రదర్శించనున్నారు.
కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిస్తే ఒక్కరు పోట్లేదని, అందరూ ఢిల్లీకి పోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరని, తీహార్ జైలులో ఉన్న కవిత అప్రోవల్ గా మారబోతున్నారని తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లి కవితను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశంలో మొదటి…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఇవాళ ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఏ ప్రాంతం చూసిన రైతుల కష్టాలు కనబడుతున్నాయన్నారు. తుల పంట పొలాలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతుల కోసం 36 గంటల నిరసన దీక్షను చేపట్టామని, ఈ దీక్ష తోనైనా ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.…