తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హస్తినకు చేరుకున్నారు.. ఇక, రేపటి నుంచి ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు.. మొదటగా మంగళవారం రోజు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రలతో సమావేశం కానున్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ…
నిత్యం ఏదోఒకచోట మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఎవరిని నమ్మాలో.. ? ఎవడు నమ్మించి కాటేస్తాడో..? కూడా తెలియని పరిస్థితి దాపురించింది.. రక్షలుగా ఉండాల్సిన వారే భక్షిస్తున్న ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయి.. తాజాగా, అరాచకానికి పాల్పడిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగు చూసింది.. జ్యూస్లో మత్తు మందు ఇచ్చి మహిళ పై అత్యాచారం చేసిన హోమ్ గార్డుపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు… అంతే కాదు, అత్యాచారం చేసిన దృశ్యాలను తన మొబైల్లో…
తెలంగాణను ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయిన వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు…
కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్, సెకండ్ డోస్ వేయించుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఫస్ట్, సెకండ్ డోస్లతో పోలిస్తే.. బూస్టర్ డోస్ కు స్పందన పెద్దగా లేదనే వాదన కూడా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం.. ఇంటి వద్దరే వెళ్లి బూస్టర్ డోస్ వేసేలా ప్లాన్ చేస్తోంది.. కోవిడ్ ఫస్ట్, సెకండ్ డోసుల పంపిణీలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంది సర్కార్.. ఇంటి వద్దకు వెళ్లి.. పొలాల్లోకి వెళ్లికూడా…
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య మరింత పెరగనుంది.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తినబాట పట్టారు.. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఆయన.. రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు.. గత కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యలు, వర్షాలు, వరదలు, సంక్షేమ పథకాలపై దృష్టిసారించిన కేసీఆర్.. మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న గులాబీ పార్టీ బాస్.. జాతీయ స్థాయిలో వివిధ కీలక నేతలతో భేటీ…
తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డ కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు
సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన రాజగోపాల్రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…