రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జిల్లాస్థాయిలో మంత్రి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించి అక్టోబరు 31లోగా బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యతలు తప్ప నిధులు లేవు..…
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైంది.. కొన్నిసార్లు అసలు పరీక్షలు లేకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది.. స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో ఇంట్లోనే కూర్చొబెట్టింది.. ఇక, సిలబస్‌ను తగ్గించడం.. పరీక్షల్లో ఆప్షన్‌గా ప్రశ్నలు పెంచడం.. ఇలా అనేక మార్పులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మహమ్మారి పోయి సాధారణ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి…
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి… అన్ని ప్రధాన పార్టీలు కేంద్రీకరించి ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. మరోవైపు.. చిన్నపార్టీలు కూడా బరిలోకి దిగాయి.. ఇక, స్వతంత్రులు కూడా భారీ సంఖ్యలో పోటీకి దిగేలా కనిపిస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.. అయితే, ఇంకా చాలా మంది అభ్యర్థులు.. నామినేషన్ పత్రాలతో క్యూ లైన్లో వేచిఉన్నారు.. క్యూలైన్లో ఉన్న అభ్యర్థుల…
మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు…
Munugode : తెలంగాణాలో ప్రస్తుతం ఏ నోట విన్నా మునుగోడు ముచ్చట్లే.. ప్రధానంగా బరిలో ఉన్న మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన శక్తినంతా కూడగట్టుకుంటున్నాయి.
కర్ణాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగింది.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇక, త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టబోతున్నారు.. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేసింది తెలంగాణ కాంగ్రెస్.. ముందుగా అనుకున్న…
2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు…