* నేడు చంద్రగ్రహణం.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందంటున్న జ్యోతిష్య నిపుణులు * తిరుమల: నేడు శ్రీవారి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత, బ్రేక్ దర్శనాలు రద్దు, ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి…
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీసు ఇచ్చింది. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఎన్నికల కమిషన్‌కి తెలపాలని నోటీసులో పేర్కొంది. పార్టీ ప్రెసిడెంట్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది.
ఉత్కంఠరేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.. గతంలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఉప ఎన్నిక ఎమ్మెల్యేను చేసింది.. అయితే, నైతిక విజయం మాదే అంటున్నారు బీజేపీ నేతలు.. ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అని మునుగోడు ఫలితం చెబుతోంది అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి… వందల కోట్ల ఖర్చు చేసి, ఓటర్ నీ భయ పెట్టినా బీజేపీకి 86 వేల ఓట్లు వచ్చాయన్న ఆయన.. నైతికంగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధించారన్నారు..…
* నేడు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌కు వీడ్కోలు.. ఈ నెల 8న జస్టిస్ లలిత్‌కు చివరి పనిరోజు.. రేపు సెలవుతో ఒక్కరోజు ముందే జస్టిస్ లలిత్ పదవీ విరమణ * తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. * కామారెడ్డి: మద్నూర్ మండలం మేనూరు వద్ద నేడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ, ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్న నేతలు * కామారెడ్డి: నేడు…
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోపణల నేపథ్యంలో… గద్వాల్ అడిషనల్ ఎస్పీపై వేటు వేసింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని కలిసినట్లుగా అభియోగాల నేపథ్యంలో.. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌పై వేటు వేసిన ఉన్నతాధికారులు.. రాములు నాయక్‌ని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుండి సెలవులో…