తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
1) ముఖ్య గమనిక.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. Read This: New Rules: ముఖ్య గమనిక.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు 2) ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలంగాణలో…
1) ఫేక్ కాల్స్ & మెసేజ్‌లను చెక్.. ట్రాయ్ కొత్త ప్రణాళిక కొంతకాలం నుంచి సైబర్ నేరాలు ఎలా పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆఫర్లు, బహుమతులు వచ్చాయంటూ.. ఫేక్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు టోకరా వేసి, సున్నితంగా దోచేసుకుంటున్నారు. వీటిని తిరస్కరిస్తున్నప్పటికీ.. మరింత ఊరించేలా సందేశాలు పంపుతూ, టెంప్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్లు పంపిన లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం.. మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా మాటుమాయం అవుతాయి.…
What’s Today: * నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్ * అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ * అమరావతి: నేడు మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మొన్నటికిమొన్న సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి.. బీజేపీ కండువా కప్పుకోగా.. ఇవాళ.. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ కమలం పార్టీ గూటికి చేరారు.. అదెల్లి పోచమ్మ గుడి వద్ద బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అయిటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రామారావ్ పటేల్…ఇక, ఆయనతో పాటు జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్…
మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా…
రైతులకు, మిల్లర్లకు శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. మిల్లర్లు, రైతులు.. సీఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్నామని తెలిపారు.. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ.. ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సీఎస్టీ…
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది.. అయితే, మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల…