Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితుల్లో, ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.34 కోట్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే ‘లెనిన్’ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ సంస్థ రూ.19 కోట్లకు సొంతం చేసుకుంది. అదే సమయంలో హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో రూ.9 కోట్లు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ రూ.6 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ మూడు విభాగాల ద్వారా ‘లెనిన్’కు రూ.34 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు అటు సోషల్ మీడియాలో ఇటు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలి కాలంలో మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాలకు ఓటీటీ డీల్స్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడం, శాటిలైట్ మార్కెట్ కూడా గతంతో పోలిస్తే మందగించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ‘లెనిన్’కు ఈ స్థాయి బిజినెస్ జరగడం చిత్రబృందానికి పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే పెట్టుబడిలో గణనీయమైన భాగం రికవరీ కావడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలకు ఉన్న బ్రాండ్ వాల్యూ కూడా బిజినెస్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ అక్కినేని కెరీర్లో ఈ సినిమా కీలకంగా మారనున్న నేపథ్యంలో జులై 10న విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ బిజినెస్‌కు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!