AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
- పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా అల్లు అర్జున్
- అట్లీ 'రాకా' షూటింగ్లో పాల్గొంటున్న బన్నీ
- 'AA23' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
- బన్నీ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AA23 Title Teaser To Released Soon: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బన్నీ.. ప్రస్తుతం స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే బన్నీ తదుపరి ప్రాజెక్ట్ ‘AA23’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AA23’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా టైటిల్ టీజర్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ టీజర్‌కు సంబంధించిన చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. లోకేష్ తన ప్రత్యేక శైలికి తగ్గట్టుగా ఈ టీజర్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, అత్యంత ఇంటెన్స్‌గా రూపొందించారట. అల్లు అర్జున్ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో చూపించేలా టీజర్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ విడుదలైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
‘AA23’ రెగ్యులర్ షూటింగ్‌ను 2026 దసరా సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా.. స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇప్పటివరకు టైటిల్ టీజర్ లేదా విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. అల్లు అర్జున్ అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!