TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC Recruitment: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొదటి నోటిఫికేషన్:
* టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మల్టీ-జోనల్ కేడర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 05/G/TP/2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
* జూలై 10, 2026 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ఎంపికైన వారికి నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతన శ్రేణి లభిస్తుంది.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు B.Arch, B.E/B.Tech (సివిల్), B.Planning లేదా B.Tech (Planning)లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే M.A/M.Sc (Geography) లేదా M.Sc (Geoinformatics)తో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
రెండో నోటిఫికేషన్:
* తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 03/OG/SD/2026 నోటిఫికేషన్ కింద మొత్తం 19 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నారు.
* ఈ పోస్టులకు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వేతనం అందుతుంది.
* సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఐసీఏఆర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్లో బేసిక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో M.Sc (Ag.) అర్హత కలిగి ఉండాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, రిజర్వేషన్లు ఇంకా ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని టీజీపీఎస్సీ సూచించింది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?