ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దులు కరణం బలరాం.. ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ గా కరణం వెంకటేష్ కు భాద్యతలు అప్పగించారు.. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయటంతో వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ చీరాల నుంచి పోటీ…
కాంగ్రెస్ వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిపోయారు మర్రి శశిధర్‌రెడ్డి. అదేదారిలో మరికొందరు ఉన్నట్లు టాక్. గ్రేటర్లో కాంగ్రెస్ బలహీన పడిందని.. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్‌కు లాయలిస్టులుగా పేరు ఉన్నవాళ్లే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ మారకుండా ఆపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. మిగిలిన నాయకులు వెళ్లిపోకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ లోనే…
నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌ను సవరించింది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ.…
TSPSC Group 4 Notification: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో జంబో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)… టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. గ్రూప్-4 నోటిఫికేషన్‌ను ఇవాళ అధికారికంగా విడుదలైంది.. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అందులో అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44…
హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసుఫ్ గూడా చెందిన మేలపాటి చెంచు నాయుడు, హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్ నగర్ కు చెందిన రవికి నోటీసులు ఇచ్చింది.
తెలంగాణలో మరోసారి విద్యుత్ చార్జీల మోత మోగనుందా? అంటే ఏమో అది జరిగినా ఆశ్చర్యం మాత్రం లేదు.. ఎందుకంటే.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావుకు సమర్పించాయి డిస్కంలు.. ఇక, తనకు అందిన ప్రతిపాదలనపై తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి అందించాయి.. ఈ వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో పెడతాం అన్నారు.. డిస్కమ్స్ ప్రతిపాదనలపై బహిరంగ ద్వారా…
What’s Today: • నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్ • నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై…
ఏపీకి కొత్త సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. అదే రోజు అంటే రేపు సాయంత్రం జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన…
తెలంగాణలో వరుసగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అయితే, నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న ఆయన.. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.. డైరెక్ట్…
వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ విషయంపై స్పందించిన ఆయన.. ఏపీలో ఫ్రీ అండ్ ఫేర్ విచారణ జరగడం లేదని వారు అంటున్నారు.. ట్రయల్ ఎక్కడ జరిగినా మాకు…