తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనర్ వివాహాలు, అరబ్ షేక్ లు మైనర్లకు పెళ్లిళ్లు చేసి ఒప్పంద పద్ధతిలో తమ దేశానికి తీసుకెళ్లిన ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాలకు నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి వరుసగా శుభవార్తలు చెబుతూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. కొన్ని టెస్ట్‌లు కూడా జరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న వేళ.. మరో 207 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది… వెటర్నరీ డిపార్ట్మెంట్లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులతో పాటు..…
కైకాల కన్నుమూత.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించిన కైకాల..1959 లో సిపాయి కూతురు…
టాలీవుడ్లో మరోసారి విషాదం నెలకొంది.. సూపర్ స్టార్ కృష్ణ ఘటన నుంచి ఇంకా తేరుకకముందే.. మరో సినీ దిగ్గజం భువినుండి దివికి ఎగిసింది.. సీనియర్ నటుడు.. కైకాల సత్యనారాయణ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. సినీ నటుడిగానే కాదు.. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.. తన 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు.. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు పోషించారు.. హాస్య, ప్రతినాయక, నాయక,…
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ రైతులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, వారితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
* నేటితో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు * నేడు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి.. పీవీ జ్ఞానభూమి దగ్గర నివాళులర్పించనున్న ప్రముఖులు * కడప: నేటి నుంచి మూడురోజుల పాటు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం, నగరంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు.. మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గంలో పర్యటన.. రు.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. భారీ ఎత్తున ఏర్పాట్లు…