* తిరుమల: శ్రీవారి ఆలయంలో రథస్తమి వేడుకలు.. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి.. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి దర్శనం * ఆదిలాబాద్: నేటితో ముగియనున్న నాగోబా జాతర.. ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన నాగోబా ప్రత్యేక పూజలు.. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ నుంచి హాజరైన భక్తులు.. చివరిరోజు దర్శనానికి క్యూ కట్టిన గిరిజనేతరులు * నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు.. పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తులు 30వ తేదీ వరకు స్వీకరణ *…
పగలు దట్టంగా మంచుకురుస్తూ చలిగాలులు వీస్తుంటే.. ఇక మధ్యాహ్నం భానుడు భగ్గుమంటున్నాడు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం రెండు కాలాలను చవిచూస్తున్నారు. అయితే.. కొద్ది రోజులుగా నెలకొన్న ఈ వింత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
టాలీవుడ్లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత.. టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ…
Teachers Transfers and Promotions: టీచర్ల బదిలీలు తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.. ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ఈ వ్యవహారంలో ఆందోళనను చేస్తూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్లకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన,…
* నేడు పురుషుల హాకీ వరల్డ్కప్ సెమీస్.. తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న జర్మనీ.. మరో సెమీస్లో బెల్జియం, నెదర్లాండ్స్ ఢీ * నేడు భారత్తో కివీస్ తొలి టీ20 మ్యాచ్.. రాంచీ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం * ఢిల్లీ: శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు విచారణ.. ఉదయం 10 గంటలకు విచారణ జరపనున్న సీబీఐ స్పెషల్ కోర్టు.. తన నానమ్మ అంత్యక్రియల కోసం శరత్ చంద్రారెడ్డి మధ్యంతర…
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. తన నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. మేము తండ్రీ కూతుర్లులా కలిసి ఉండేవారిమని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు చెప్పానని అన్నారు.
పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది… తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం…
Teachers Transfers: తెలంగాణలో రేపటి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్ లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు –…