MLA Sanjay Kumar: భోగ శ్రావణి రాజీనామా.. స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sanjay Kumar: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. తన నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. మేము తండ్రీ కూతుర్లులా కలిసి ఉండేవారిమని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు చెప్పానని అన్నారు. గత కొన్ని నెలలుగా చైర్మన్ పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నా సయోధ్య కుదర్చారన్నారు ఆయన. ఇటీవల కౌన్సిలర్లు ట్రస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చినా తిరస్కరించారన్నారు. ఈ విషయాన్ని కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. నేను స్వయంగా చైర్ పర్సన్ భోగ శ్రావణికి ఫోన్ చేసి బుధవారం ఉదయం కౌన్సిలర్ల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పినా.. హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోగ శ్రావణి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
Read also: Revanth Reddy: కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. ఇప్పుడు కేసీఆర్ దారిలోనే..
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
నిన్న జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియా ముందు కంటతడి పెట్టారు శ్రావణిచైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నానని, మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నాడని.. డబ్బులు కోసం డిమాండ్ చేసారని, మేము ఇచ్చుకోలేం అని చెప్పామని దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారన్నారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేసాడని, మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారిందన్నారు శ్రావణి.
Read also: Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే
ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం జారీ చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. నరకయాతనకు గురి చేసాడని, ఆశీర్వదిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వస్తే వేధింపులు ఎక్కువ చేసేవాడని, ఎమ్మెల్యేతో మాకు ఆపద ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వేడకున్నారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని, ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానన్నారు. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం చేశారని, స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని ఆమె వెల్లడించడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!