Weather Forecast: పగలు దట్టంగా మంచుకురుస్తూ చలిగాలులు వీస్తుంటే.. ఇక మధ్యాహ్నం భానుడు భగ్గుమంటున్నాడు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం రెండు కాలాలను చవిచూస్తున్నారు. అయితే.. కొద్ది రోజులుగా నెలకొన్న ఈ వింత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈనేపథ్యంలో.. రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రంగా ఉంటుండ గా మధ్యాహ్నం ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇలా.. వారం రోజుల్లో చలి ప్రభావం దుప్పట్లు కప్పుకున్న అస్సలు తగ్గడం లేదురా బాబోయ్ అన్నట్లు ఉంటే.. ఇక మధ్నాహ్నం నుంచి ఎండ తీవ్రత రానురాను మరింతగా పెరుగుతుంది. డిసెంబర్‌లో ప్రతి ఏడాది చలి తీవ్రత ఎక్కువగానే ఉండటం మామూలే అయినా ఈ ఏడాది మరింత ఎక్కువ చలి కనిస్తోంది.
Read also: KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
ఉదయం చలి మధ్నాహ్నం భానుడి భగభగతో రాష్ట్ర ప్రజలు రెండు కాలాలను చవిచూడాల్సి వస్తుందని.. ఉదయం బయటకు రావాలంటేనే భయం వేస్తుందని, ఇక మధ్నాహ్నం భానుడు హీట్ పెంచుతుండటంతో నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలా ఎన్ని రోజులు అనుభవించాలిరా దేవుడా అంటున్నారు. అటు చలి ఇటు వేడి వాతావరణంతో జనం ఏంటిరాబాబు మా పరిస్థితి అన్నట్లు తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉదయం చలికి బటకు రాలేని పరిస్థితులు నెలకొంటుంటే.. మధ్నాహ్నం సూర్యుడు తన ప్రతాపంతో బయట తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని నగరవాసులు అంటున్నారు. ఏదైమైనా మనం ఇలా రెండు కాలాలను మరి కొద్దిరోజులు చవి చూడాల్సిందే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Read also: BIG Breaking: టాలీవుడ్‌లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రెండు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ కు చేరాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ (యూ) లో 9.6 గా నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ 9.8 నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబి లో 10.7. నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 12.8 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.
సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కొనసాగుతుంది.
మెదక్ జిల్లా కొల్చారం లో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
BRS Party: నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లోకి గిరిధర్ గమాంగ్..