Teachers Transfers and Promotions: తెలంగాణలో నేటి నుంచే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు.. రూల్స్ తెలుసుగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Transfers and Promotions: టీచర్ల బదిలీలు తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.. ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ఈ వ్యవహారంలో ఆందోళనను చేస్తూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్లకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్‌కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు – 2023. గైడ్ లైన్స్ విషయానికి వస్తే.. బదిలీకి కటాఫ్ తేదీ 1 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు.. యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయి.. అంటే 1 ఫిబ్రవరి 2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అవుతారు.. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్ కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.. 1 ఫిబ్రవరి 2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాల పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ జరగనున్నాయి. ఇక, మూడు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇక, 50 ఏళ్ల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో మాత్రమే 50 ఏళ్లు పైబడిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇస్తారు.. SSC పెర్ఫార్మెన్స్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ తొలగించారు అధికారులు.. 17 శాతం,13 శాతం, 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకారం కేటగిరీ 1, 2, 3గా వర్గీకరణ పాయింట్స్ ప్రతి సంవత్సరానికి వరుసగా 1,2,3 పాయింట్స్ కేటాయిస్తారు.. లోగడ ఉన్న నాల్గో కేటగిరీని తొలగించారు.. ఇక, స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు. ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపజేస్తారు.. వోడీ ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్స్ కేటాయించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో 70 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయుల లేదా వారి జీవిత భాగస్వామి (స్పౌజ్) క్యాన్సర్, బోన్ టిబి, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతో పాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డైయాలసిస్ కు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కి అనుమతి ఇస్తారు. జువనైల్ డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనుమతి ఉంటుంది.. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకునే వారు ఈ ఏడాది జనవరి 1వ తేదీ తరువాత ఉన్న తేదీలలో జిల్లా మెడికల్ బోర్డు (DMB) నుండి సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఉపాధ్యాయులు అయినచో స్పెషల్ కేటగిరీ పాయింట్స్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ వర్తిస్తాయి. ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయి పేర్కొంది విద్యాశాఖ.
మరోవైపు.. మల్టీజోన్ స్థాయిలో డియస్ఈ చే నామినేట్ చేయబడిన జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారి చైర్మన్ గా, ఆర్జేడీ సెక్రటరీగా, సంబంధిత డీఈవో సభ్యునిగా కౌన్సెలింగ్ కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జడ్పీ సీఈవో సభ్యునిగా, డీఈవో సెక్రటరీగా కమిటీ ఉంటుంది… జిల్లా స్థాయిలో జడ్పీ, ఎంపీ టీచర్లకు జడ్పీ చైర్పర్సన్ చైర్మన్ గా, కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ సీఈవో సభ్యులు గా, డీఈవో కార్యదర్శి గా కమిటీ ఉంటుంది.. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలకు డీఈవో, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా ఉంటారు. ట్రాన్సఫర్ ఆర్డర్ పొందిన ప్రాధానోపద్యాలు, ఉపాధ్యాయులు అందరూ ఈ విద్యా సంవత్సరం (2022-23) చివరి పనిదినం రోజు మాత్రమే పాత స్టేషన్ నుండి రిలీవ్ కాల్సి ఉంటుందని గైడ్‌లైన్స్‌లో తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!