Teachers Transfers: రేపటి నుంచే ఉపాధ్యాయ బదిలీలు.. గైడ్ లైన్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Transfers: తెలంగాణలో రేపటి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్ లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్‌కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు – 2023. గైడ్ లైన్స్ విషయానికి వస్తే.. బదిలీకి కటాఫ్ తేదీ 01.02.2023గా నిర్ణయించారు.. యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయి.. 1.02.2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అవుతారు.. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్ కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.. 01.02.2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాల పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ జరగనున్నాయి. ఇక, మూడు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.
Read Also: Republic Day 2023: ఇది సంక్షేమ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించని గవర్నర్..!
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
మరోవైపు.. 50 ఏళ్ల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది.. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 ఏళ్లు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇస్తారు.. SSC పెర్ఫార్మెన్స్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ తొలగించారు అధికారులు.. 17 శాతం,13 శాతం, 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకారం కేటగిరీ 1, 2, 3గా వర్గీకరణ పాయింట్స్ ప్రతి సంవత్సరానికి వరుసగా 1,2,3 పాయింట్స్ కేటాయిస్తారు.. లోగడ ఉన్న నాలుగవ కేటగిరీని తొలగించారు.. ఇక, స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు. ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపజేస్తారు.. OD ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్స్ కేటాయించారు.
ప్రిఫరెన్షియల్ కేటగిరీలో 70 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయుల లేదా వారి జీవిత భాగస్వామి (స్పౌజ్) క్యాన్సర్, బోన్ టిబి, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతో పాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డైయాలసిస్ కు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కి అనుమతి ఇస్తారు. జువనైల్ డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనుమతి ఉంటుంది.. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకునే వారు 01.01.2023 తరువాత ఉన్న తేదీలలో జిల్లా మెడికల్ బోర్డు (DMB) నుండి సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఉపాధ్యాయులు అయినచో స్పెషల్ కేటగిరీ పాయింట్స్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ వర్తిస్తాయి. ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయి.
మల్టీజోన్ స్థాయిలో డియస్ఈ చే నామినేట్ చేయబడిన జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారి చైర్మన్ గా, ఆర్జేడీ సెక్రటరీగా, సంబంధిత డీఈవో సభ్యునిగా కౌన్సెలింగ్ కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జడ్పీ సీఈవో సభ్యునిగా, డీఈవో సెక్రటరీగా కమిటీ ఉంటుంది… జిల్లా స్థాయిలో జడ్పీ, ఎంపీ టీచర్లకు జడ్పీ చైర్పర్సన్ చైర్మన్ గా, కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్ సీఈవో సభ్యులు గా, డీఈవో కార్యదర్శి గా కమిటీ ఉంటుంది.. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలకు డీఈవో, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా ఉంటారు. ట్రాన్సఫర్ ఆర్డర్ పొందిన ప్రాధానోపద్యాలు, ఉపాధ్యాయులు అందరూ ఈ విద్యా సంవత్సరం (2022-23) చివరి పనిదినం రోజు మాత్రమే పాత స్టేషన్ నుండి రిలీవ్ కాల్సి ఉంటుందని గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ.
తాజావార్తలు
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్‌లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!