Today Events April 11, 2023
* నేడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సెల్‌ఫోన్ డౌన్ నిరసన.
* ప్రకాశం జిల్లా మార్కాపురంలో రేపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు. వైసీపీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే నాగార్జున రెడ్ది సమావేశం.
* బాపట్ల జిల్లా చీరాలలో రెండవ రోజు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన.
* తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్… నేటి నుంచి తీవ్రం కానున్న ఎండలు, వడగాల్పులు
* నేడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
* కడపలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. దళితులపై దాడులు, పశుసంవర్ధక శాఖ డిడి అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్.
* నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం.
* వరంగల్ లో SSC పేపర్ లీకేజీ కేసు.. బండి సంజయ్ సహా మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ.
* వైఎస్ వివేకా హత్యకేసులో నేడు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డిల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ.
* నేడు కొల్లాపూర్ నియోజవర్గానికి జూపల్లికృష్ణారావు. అనుచరులతో భేటీ.
* ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్.. రెండు జట్లకు కీలకంగా మారిన మ్యాచ్
*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్