తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్…
ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను.. మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ…
రుషికొండ తవ్వకాలపై పవన్ సెటైర్లు.. రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్…
శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శన టోకెన్ల జారీ కేంద్రాలు మార్పు.. కలియుగ ప్రత్యక్షదైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను మార్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరి నడకమార్గంలో జారీ చేసే దర్శన టోకెన్లు.. ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోనే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.. ఇక, టోకెన్ పొందిన భక్తులు అలిపిరి నడకమార్గంలో 2083 మెట్టు దగ్గర స్కాన్ చేసుకుంటునే దర్శనానికి…
హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణ నేడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు.