హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణ నేడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరుకానున్నారు. ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది. వారంతా కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించింది. పీఠం లోపల అంబేడ్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆడియో, విజువల్ ఏర్పాట్లు, ఇంటీరియర్ డిజైన్లు పూర్తయ్యాయి.
Also Read:Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?
శుక్రవారం డాక్టర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల బాబా సాహెబ్ అంబేడ్కర్ మహా విగ్రహాన్ని.. ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుండడం యావత్ దేశానికే గర్వకారణమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన తెలంగాణ బాంధవునికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది అని సీఎం కేసీఆర్ చెప్పారు.
Also Read:AP CMO: మాటలు జాగ్రత్త.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఏపీ సీఎంఓ వార్నింగ్
రాష్ట్ర సచివాలయం పక్కనే, బుద్ధ విగ్రహానికి ఎదురుగా, తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం పక్కన ఏర్పాటు చేసిన దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రతి రోజూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందని, రాష్ట్ర పాలనా యంత్రాంగం అంతా చైతన్యవంతం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, యావత్ తెలంగాణ ప్రజలు, దేశం యావత్తు ఘనంగా జరుపుకోవాలని ఆయన మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారు.