Renu Desai: జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు, ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ, వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్న ఆవేదనతో వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి ‘పిచ్చి పట్టింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రేణు దేశాయ్ అత్యంత కటువుగా స్పందించారు. “మొత్తం న్యాయం అనేది ఒక జోక్ అయిపోయింది, దానికి నేనే సాక్ష్యం” అంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జికి కుక్కల మీద ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండవచ్చని, ఇది మానవత్వంతో ఇచ్చిన తీర్పు కాదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
READ ALSO: Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
“ఇలా అన్నందుకు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా నాకు భయం లేదు, నేను దీనిని బహిరంగంగా సవాల్ చేస్తున్నాను” అని ఆమె తెగేసి చెప్పారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జికి కుక్క ఏదైనా పర్సనల్ గా చేసి ఉంటుంది, అని పేర్కొన్న ఆమె ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది చనిపోతున్నారు, వాటిని ఏమని పిలవాలి?దోమకాటు వల్ల సంభవిస్తున్న మరణాలు ప్రాణాలు కావా కేవలం కుక్కల వల్ల మరణించిన వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుని, మూగజీవుల ప్రాణాలను తీయడం ద్వంద్వ నీతి కాదా? అని ఆమె మండిపడ్డారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సామాన్య జీవకోటి రక్షణ కోసం ఉండాలి కానీ, సంహారం కోసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాగుతున్న ఈ కుక్కల ఊచకోత వెనుక ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయని, వాటిని కప్పిపుచ్చుకోవడానికి మూగజీవులను బలి చేస్తున్నారని ఆమె విమర్శించారు. న్యాయవ్యవస్థపై ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ మరియు న్యాయ వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.
READ ALSO: India: ఈ రెండు ముస్లిం దేశాల్లో భారత్‌కు అసలైన ‘స్నేహితుడు’ ఎవరు?