CM KCR: ఈ రోజు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు…
* కర్ణాటక నూతన సీఎంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. ఈ రోజు ఉదయం మరోసారి ఖర్గేతో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇరువురు నేతలతో నేడు రెండవ విడత చర్చలు తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటించనున్న పార్టీ * ఐపీఎల్లో నేడు పంజాబ్‌తో ఢిల్లీ ఢీ.. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..…
విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు…
గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది..…
కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు…
TS EAMCET : ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు.
జాతీయ స్థాయిలో మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' తెలుగు వర్షన్ శనివారం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితమౌతోంది. అయితే భైంసాలాంటి పట్టణాలు ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం వివాదాలకు దారితీస్తోంది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు.. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. తిరుమల నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృత్యువాత…
Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ…