Rudra Karan Partaap : పదవీవిరమణ చేసే వరకు కేసీఆర్‌కు ఓటమి లేదు.. జ్యోతిష్కుడి ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rudra Karan Partaap : కొద్దిరోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అటువైపు కాంగ్రెస్ , బీజేపీ ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి ప్రాధాన్యత ఉన్నది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే కచ్చితమైన అంచనాను చెప్పారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. దీంతో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చేసిన జోస్యానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తనంత తానుగా పదవీవిరమణ చేసేంతవరకు కేసీఆర్ కు ఓటమి లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also:Shakunthalam: సమంత కష్టానికి కొంత ఫలితం అయినా వచ్చిందిగా…!!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Namo Rudraya🙏🏻 In the upcoming Telangana elections, The reigning government of Shri. K. Chandrashekhar Rao will be re-elected & continue its tenure in Telangana.
— Rudrá Karan Pártaap🇮🇳 (@Karanpartap01) May 27, 2023
‘నమో రుద్రాయా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ అధికారాన్ని చేపడుతుంది. ఆ ప్రభుత్వమే తెలంగాణను పాలిస్తుంది’ అని రుద్ర కరణ్ పర్తాప్ మే 27వ తేదీన సాయంత్రం 7.38 గంటలకు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదిలా ఉండగా.. వేదిక్ అస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.. ఎన్ని సీట్లను కైవసం చేసుకుందో కూడా ముందే జోస్యం చెప్పారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల (మే) 10వ తేదీన జరగ్గా.. అదే నెల 13వ తేదీన ఫలితాలు వచ్చాయి. రుద్ర కరణ్ పర్తాప్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. మే నెల బీజేపీకి అనుకూలంగా లేదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికంగా ఉన్నాయని అంచనా వేశారు. ఆయన అన్నట్లే అదే నిజమై సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!