Telangana Rains: నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Steel Flyover: హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్.. ఇందిరాపార్క్-వీఎస్‌టీ స్టీల్ నిర్మాణం..
అలాగే 18న ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్ష సూచన ఈరోజు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కాగా, నిజామాబాద్ జిల్లా నవీపేటలో 119.2, బోధన్‌లో 67, రంజాల్‌లో 64, యడపల్లెలో 61.4, మాక్లూర్‌లో 56.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. నిన్న అత్యధికంగా రామగుండంలో 35.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా మెదక్, నల్గొండలో 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టం 31.8, కనిష్టంగా 24.4, ఖమ్మం గరిష్టం 29.8, కనిష్టంగా 25.4, నిజామాబాద్ గరిష్టం 32.5, కనిష్టంగా 23.1, నల్గొండ గరిష్టం 33, కనిష్టంగా 22, హనుమకొండలో 31, కనిష్టంగా 24.5 డిగ్రీలు నమోదయ్యాయి.
Ambati Rambabu: నేను నిరూపిస్తా.. ఛాలెంజ్ చేస్తున్నా.. చర్చకు రాగలరా?