మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి(81) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు.
Pawan Kalyan will be back to shooting soon: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త తెరమీదకు వచ్చింది. అయితే ఈ వార్త అధికారికం కాదు కానీ జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసి మరి ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు యాత్రకు బ్రేక్…
రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
మణిపూర్ అల్లర్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.