తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా…
టీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ సెక్టార్ లో పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు.
ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా.. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
గత ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రాజధాని హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరద ప్రభావం, సహాయక చర్యలు వంటి అంశాలపై అధికారుల ఆయన దిశానిర్దేశం చేశారు.