తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా.. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నీటిని దిగువకు వదులుదామంటే ప్రాజెక్టులోని నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో క్షణం క్షణం నీటిమట్టం పెరుగుతోంది. పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
Read Also: Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
పరిస్థితి ఇలాగే కొనసాగితే కడెం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ప్రాజెక్ట్ లోకి ఇన్ ప్లో 93,200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 14 గేట్లు ఎత్తి దిగువకు 1,55,770 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నట్టు తెలిపారు. అయితే, కడెం ప్రాజెక్టును నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. భారీగా వస్తున్న వరద నీటిపై అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఎగువన భారీగా వర్షం కురవడంతో వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. ఇక, ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పాడు. గేట్లను ఎత్తి వరద నీటిని బయటకు వదులున్నట్లు పేర్కొన్నాడు.
Read Also: CM KCR: తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.6టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వను 5.6 టిఎంసీల వరకు ఉంచారు. పద్దెనిమిది గేట్లలలో పద్నాలుగు గేట్లు ఎత్తినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా నాలుగు గేట్లను రిపేర్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దస్తురాబాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. అయితే, ఎంత మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారనే దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.