లారీ ఎక్కి ఊగిపోతే ఎలా తెలుస్తుంది..? పవన్‌పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు
మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్యాకేజీ స్టార్.. పవన్ కట్యాణ్ నువ్వు చెప్పిన వాలంటీర్లు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు పింఛన్ అందిస్తున్నారు. వారికి అవసరమైన ప్రభుత్వ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. అప్పుడు నువ్వు, నీ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముసుగుతన్ని పడుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ రోజు తెలియ లేదా వాలంటీర్లకు బాస్ ఎవరో? అంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశారు మంత్రి అమర్నాథ్.. ఎవరు చెప్తే వారు ప్రజలకు మంచి చేస్తున్నారో? వారు ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తారు అని? ఇప్పుడు వారిపై నిందలు వేయడానికి తయారయ్యావు. వాలంటీర్లు చేసే మంచి ఏంటో వారి వల్ల లబ్ధిపొందుతున్న ప్రజలను నేరుగా అడుగు తెలుస్తుందని అని సూచించారు. అంతే తప్ప లారీ (వారాహి వాహనం) ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుంది? అంటూ #PackageStarPK తో ట్వీట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం జరుగుతుందని.. అసలు డబ్బులు తీసుకునేవారిని వాలంటీర్లు అని ఎలా అంటారు..? వారిలో కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు.. ప్రజల డేటా మొత్తం సేకరించడానికి వీరికి హక్కు ఎక్కడి అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించిన విషయం విదితమే.. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ చేసిన ఓ ట్వీట్‌కు బదులిస్తూ.. ఇలా ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఏపీలో దారుణం.. ఐదో క్లాస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. అన్నే నిందితుడు..!
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఏలూరు జిల్లాలో ఐదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు దుర్మార్గులు.. మాయ మాటలు చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన కామాంధులు.. నాలుగు నెలలుగా వారి పశువాంఛ తీర్చుకున్నారు.. నిందితుల్లో బాలిక అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) కూడా ఉండడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. మరో నిందితుడు మైనర్ కాగా.. బాలిక చదువుకునే స్కూల్‌లోనే 7వ తరగతిలో ఉన్నాడు.. ఏలూరు జిల్లా మండవల్లిలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండవల్లి బీసీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.. 4 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు.. ముగ్గురిలో ఒకడు బాలుడు (మైనర్) కాగా.. బాలిక చదివే పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు.. ఇక, నిందితుల్లో ఒకరు బాలిక సొంత అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) కూడా ఉండడం సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోంది.. మరో వ్యక్తి మండవల్లి మండలం భైరవపట్నం చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉండగా.. ప్రధాన నిందితుడైన బాలిక అన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
సాధారణ విధులకు మహిళా పోలీసులను వినియోగించొద్దు.. డీజీపీ ఆదేశాలు
సాధారణ పోలీసు విధులకు మహిళా పోలీసులను వినియోగించొద్దు అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఈ మేరకు పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు.. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావల్సిన పూర్తి సహాయసహకారాలు అందించడం మహిళా పోలీసు ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు శాంతి భద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చారు.
వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!
పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి.. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారి వల్ల బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందన్నారు.. మా పార్టీలో ఉన్న వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రుణాలు ఎగ్గొట్టి వెళ్ళే ప్రసక్తే లేదు.. నేను పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కంపెనీలో వ్యాపారం జరుగుతుంది.. రావాల్సిన బకాయిలు రావాలన్న ఆయన.. బ్యాంకులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నానని వెల్లడించారు.ఇక, వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం సహజమే.. అంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణం అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. కంపెనీకి 1500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. బకాయిలు రావాలి.. వచ్చిన వెంటనే చెల్లిస్తామని వివరణ ఇచ్చారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని హితవుపలికారు. శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో నేను గెలవలేని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం ఎదుర్కోలేక నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కాగా, మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే, వాటిని చెల్లించలేదు. ఇక, ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. దీంతో కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం విదితమే.
రైల్వే మంత్రితో ఎంపీ నామ భేటీ.. ఆ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఖమ్మం జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి నామా తీసికెళ్లారు. ప్రధానంగా.. ప్రతిపాదిత ‘డోర్నకల్ – మిర్యాలగూడ’ రైల్వే లైన్ అలైన్మెంట్‌ను మార్చాలని కోరారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అందుకు పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోకపోతే.. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలామంది రైతులు తమ భూములు కోల్పోతారని మంత్రికి నామా వివరించారు. నాలుగు హైవేలు, నాగార్జున సాగర్ కాలువ కింద.. ఇప్పటికే ఆ మండలాల్లో చాలామంది రైతులు వందలాది ఎకరాల వ్యవసాయ భూముల కోల్పోయారని తెలిపారు. ప్రతిపాదిత రైలు వల్ల జిల్లాకు ఒనగూడే ప్రయోజనం లేదని తెలియజేశారు. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల్లో రైల్వే లైన్ కింద పోయే వ్యవసాయ భూములు ఎంతో విలువైనవని చెప్పారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నామ నాగేశ్వరరావు వినిపించిన వినతులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిసింది.
ప్రధానికి రక్తంతో లేఖ.. కారణమేంటి..?
ఉత్తరప్రదేశ్ లో నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యోగి క్యాబినెట్ మంత్రి డాక్టర్. సంజయ్ కుమార్ నిషాద్ తన కమ్యూనిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాశారు. తన జీవితాంతం మత్స్యకారుల సమాజానికి అంకితమై ఉంటానని లేఖలో పేర్కొన్నారు. మచ్చువా సర్వహిత్ మరియు నిషాద్ పార్టీతో కలిసి తన ఏకైక తీర్మానం అని చెప్పారు. అంతేకాకుండా నిషాద్ పార్టీ మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిందని.. దాని ఏకైక లక్ష్యం మత్స్యకారులను అభివృద్ధిలో ప్రముఖ పాత్రలో తీసుకురావడం అని లేఖలో తెలిపారు. అయితే ఆయన ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు రక్తంతో లేఖలు రాశారు. ఆ లేఖలో మత్స్యకారులకు ఎస్సీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలని సంజయ్ నిషాద్ డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉందని అన్నారు. లాకెట్ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మహిళా అభ్యర్థిని కూడా వివస్త్రను చేసి, ఆమె పట్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అమానవీయంగా వ్యవహరించారని ఆమె చెప్పారు. ఇదో మణిపుర్ తరహా ఘటన అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కూడా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో జరిగిన నేరాలు బెంగాల్‌లో కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. “మణిపూర్ సంఘటనను మేము ఖండిస్తున్నాము. ఇది విచారకరమైన సంఘటన. కానీ పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ పంచ్లాలో మహిళా బీజేపీ కార్యకర్తను నగ్నంగా ఊరేగించారు, ఇది మణిపూర్ సంఘటన కంటే తక్కువ విచారకరం?. రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్కటే.. మణిపుర్ ఘటనలో వీడియో ఆధారం ఉంది. పశ్చిమ బెంగాల్ ఘటనలో వీడియో ఆధారం లేదు’’ అని సుకాంత మజుందార్ శుక్రవారం అన్నారు.
ఐఫోన్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..
ఒక్కసారి ఐఫోన్ వాడారంటే చాలు.. మరో ఫోన్ వైపు కన్నెత్తిచూడరు.. మళ్లీ ఫోన్ కొనాలంటే ఐఫోన్ కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తారు.. అయితే, కొత్త మోడల్ కోసం ఎదురుచూసే ఐఫోన్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. ఎందుకంటే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఆలస్యం కావచ్చు, సెప్టెంబర్ కాకుండా వాయిదా పడే అవకాశ కనిపిస్తోంది.. ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ సంవత్సరం ఆలస్యం కానున్నాయి. అయితే, యాపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్ జెన్‌ని సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తుంది మరియు అదే నెలలో కొన్ని రోజుల తర్వాత వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. కానీ, COVID-19 మహమ్మారి కారణంగా iPhone 12 సిరీస్ లాంచ్ 2020లో సాధారణం కంటే ఆలస్యం అయింది. ఈ సంవత్సరం, రాబోయే యాపిల్ iPhone 15 సిరీస్ కూడా ఇదే విధమైన ఆలస్యాన్ని ఎదుర్కొంటుంది. ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో మార్కెట్లోకి రావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BOA) పరిశోధకుడు సూచిస్తున్నారు. ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, స్క్రీన్ తయారీ సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్ సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తే.. కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని మరో నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, ఐఫోన్ 15 లాంచ్ కొన్ని వారాలు ఆలస్యం కావచ్చు అంచున్నారు.. అయితే, యాపిల్ తన కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తూ వస్తుంది. నివేదికల ప్రకారం, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max మోడల్‌లను కలిగి ఉన్న iPhone 15 సిరీస్ సెప్టెంబర్‌లో అధికారికంగా రావాల్సి ఉన్నా.. ప్రో మోడల్ యొక్క మెటల్ షెల్‌కు స్క్రీన్ జతచేసేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని.. దీంతో LG డిస్‌ప్లే తయారీ ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొంటోందని అందుకే ఆలస్యం కావొచ్చు అని అంటున్నారు.
సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..
మధ్యప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుసుకున్న ఆమె అన్న.. స్నేహితుడ్ని పార్టీ పేరుతో పిలిచి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. జులై 17వ తేదీన కన్నౌజ్ పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గుర్తు తెలియనిమృతదేహం వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని, విచారణ చేపట్టారు. అప్పుడు వాళ్లకు.. ఆ మృతదేహం తూబేల్ పురాకు చెందిన అనిల్‌దిగా (25) గుర్తించారు. అతని తండ్రి విక్రమ్ మరో పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు మిస్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఇక అప్పటి నుంచి పోలీసులు అనిల్ హత్య మిస్టరీని ఛేధించడం మొదలుపెట్టారు. ఈ విచారణలో భాగంగా.. పోలీసులకు మొదట అనిల్ స్నేహితుడు దీపక్ కల్వార్‌పై అనుమానం వచ్చింది. అతనికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారించారు. ఫైనల్‌గా.. ఈ హత్య వెనుక ప్రధాన హస్తం దీపక్‌దే ఉండొచ్చని అనుమానం కలగడంతో.. అతనితో పాటు అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు దీపక్ తానే తన స్నేహితులతో కలిసి అనిల్‌ని చంపినట్టు ఒప్పుకున్నాడు. అనిల్ కూడా తనకు స్నేహితుడేనని తెలిపాడు. అయితే.. తన సోదరితో అనిల్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న విషయం తెలిసి తాను కోపాద్రిక్తుడినయ్యానని, దాంతో అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని దీపక్ పేర్కొన్నాడు. పార్టీ పేరుతో అనిల్‌ని పిలిపించి.. అతడ్ని చంపినట్లు తెలిపాడు. కాగా.. తలపై బలమైన రాడ్డుతో బాదడం వల్ల అనిల్ మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.
సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..
మధ్యప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుసుకున్న ఆమె అన్న.. స్నేహితుడ్ని పార్టీ పేరుతో పిలిచి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. జులై 17వ తేదీన కన్నౌజ్ పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గుర్తు తెలియనిమృతదేహం వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని, విచారణ చేపట్టారు. అప్పుడు వాళ్లకు.. ఆ మృతదేహం తూబేల్ పురాకు చెందిన అనిల్‌దిగా (25) గుర్తించారు. అతని తండ్రి విక్రమ్ మరో పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు మిస్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఇక అప్పటి నుంచి పోలీసులు అనిల్ హత్య మిస్టరీని ఛేధించడం మొదలుపెట్టారు. ఈ విచారణలో భాగంగా.. పోలీసులకు మొదట అనిల్ స్నేహితుడు దీపక్ కల్వార్‌పై అనుమానం వచ్చింది. అతనికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారించారు. ఫైనల్‌గా.. ఈ హత్య వెనుక ప్రధాన హస్తం దీపక్‌దే ఉండొచ్చని అనుమానం కలగడంతో.. అతనితో పాటు అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు దీపక్ తానే తన స్నేహితులతో కలిసి అనిల్‌ని చంపినట్టు ఒప్పుకున్నాడు. అనిల్ కూడా తనకు స్నేహితుడేనని తెలిపాడు. అయితే.. తన సోదరితో అనిల్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న విషయం తెలిసి తాను కోపాద్రిక్తుడినయ్యానని, దాంతో అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని దీపక్ పేర్కొన్నాడు. పార్టీ పేరుతో అనిల్‌ని పిలిపించి.. అతడ్ని చంపినట్లు తెలిపాడు. కాగా.. తలపై బలమైన రాడ్డుతో బాదడం వల్ల అనిల్ మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.
గాల్లో ఎగురుతున్న కార్లు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
విమానాలు ఆకాశంలో ఎగిరినట్లు.. కార్లు కూడా ఎగరగలవా..!. పిచ్చి కానివ్వండి కార్లు గాల్లో ఎందుకు ఎగురుతాయి. ఏదో సినిమాలో మాత్రమే అలా సాధ్యమవుతుంది. ఐతే ఇప్పుడున్న టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుండటంతో.. గాల్లో ఎగిరే కార్లు తయారు చేస్తున్నారు. అలాంటి కార్లు మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్లు గాలిలో ఎగరడం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఆ వీడియోలో రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం చూడవచ్చు. ఇంతలో రెండు కార్లు జీబ్రా క్రాసింగ్ దగ్గరకు రాగానే హఠాత్తుగా గాలిలోకి లేచాయి. ఇది చూసి వెనుక నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా ఆగింది. అది రియాలా.. లేదంటే ఫేక్ అనేది తెలియదు. అయితే ఆ వీడియోను షేర్ చేసిన వినియోగదారుడు కూడా షాక్ అయ్యి ‘ఆఖిర్ యే హో క్యా రహా హై?’ అని క్యాప్షన్ లో పెట్టాడు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు దెయ్యం సినిమాల్లో కనిపిస్తాయి. దెయ్యాలు వాటంతట అవే గాలిలో ఎగురుతాయి. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు ఫేక్ అని అంటున్నారు.
అసలు సీఎం ఎవరు.. అతను మంచి వ్యక్తి అని ఎవరు చెప్పారు.. ?
సాధారణంగా ఒక సినీ సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ మృతి చెందితే.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల వరకు వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక మాజీ సీఎం మృతి చెందితే.. దాదాపు వారం రోజుల వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన సాధించిన విజయాలు.. ప్రజలకు ఆయన ఏం చేశాడు.. ? ఏ ఏ పార్టీలో పనిచేశాడు.. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యనే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది.అయితే ఉమెన్ చాందీ మృతిపై మలయాళ కమెడియన్, విలన్ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు. వినాయకన్.. ఈ పేరు తమిళ్, మలయాళ భాషల్లో గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అంతెందుకు.. విశాల్ నటించిన పొగరు సినిమా చూశారా .. అందులో విలన్ గా నటించిన శ్రియా రెడీ వెనుక అక్కా అక్కా అంటూ కుంటికాలుతో తిరుగుతూ ఉంటాడు కదా .. అతనే వినాయకన్. విలన్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు.. ఉమెన్ చాందీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో లైవ్ చాట్ పెట్టి.. అసలు ఎవరు ఉమెన్ చాందీ అంటూ ప్రశ్నించాడు. ” ఉమెన్ చాందీ ఎవరు..మూడు రోజుల నుంచి ఎక్కడ చూసిన ఆయనే కనిపిస్తున్నాడు. అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం చాలా విడ్డురంగా ఉంది. మనిషి అన్నాకా మరణించడా..? ఇలాంటి వార్తలపై ఫోకస్ పెడుతున్నారు ఎందుకు..? ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలి. అంతేకాకుండా ఆయన మంచి వ్యక్తి అని చూపిస్తున్నారు.. అది తప్పు.. ఎవరు చెప్పారు.. ఆయన మంచి వ్యక్తి” అని అంటూ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు వినాయకన్ .. ఎందుకు ఇలా అన్నాడు.. వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తడిచిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి..
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలేపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది.మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పొట్టి మిడ్డీలో, పింక్ టాప్ లో హాట్ అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది.. వర్షంలో తడుస్తూ తడిచిన అందాలతో పరవాల విందు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి..ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది..అనతి కాలంలోనే కృతి శెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది.