SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSY, PPF Interest Rates: మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా సురక్షితమైన, స్థిరమైన రాబడి కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పోస్టాఫీస్, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి పథకాల్లో మదుపు చేసేవారికి గతంలో మాదిరిగానే అధిక వడ్డీ ప్రయోజనాలు అందనున్నాయి.
రూ.5 వేల పొదుపుతో రూ.28.5 లక్షలు ఎలా సాధ్యం?
ఈ పథకాల్లో అత్యధిక ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్న పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’. ప్రస్తుతం ఇందులో 8.2 శాతం వడ్డీ అమల్లో ఉంది. ఒకవేళ ఆడపిల్లల భవిష్యత్తు కోసం నెలకు రూ.5,000 చొప్పున (ఏడాదికి రూ.60,000) జమ చేస్తే.. 15 ఏళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్ మొత్తం రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ స్కీమ్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు స్థిరంగా కొనసాగితే, మెచ్యూరిటీ సమయానికి ఏకంగా సుమారు రూ.28.5 లక్షల నిధి చేతికి అందుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ.19.5 లక్షల అదనపు ఆదాయం సమకూరుతుంది. పైగా ఈ పథకానికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉండటం విశేషం.
Also Read
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
పీపీఎఫ్‌లో ఎంత రాబడి వస్తుందంటే..
మరోవైపు సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా పేరొందిన పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఒక వ్యక్తి ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్ల పాటు పీపీఎఫ్‌లో డిపాజిట్ చేస్తే, అతను జమ చేసే మొత్తం రూ.9 లక్షలు అవుతుంది. 15 ఏళ్ల ముగింపు సమయానికి వడ్డీతో కలిపి సుమారు రూ.16 లక్షల మొత్తం సమకూరుతుంది. ఇది కూడా పూర్తిగా పన్ను రహిత ఆదాయం కావడం విశేషం.
పథకాల వారీగా తాజా వడ్డీ రేట్ల వివరాలు:
• సుకన్య సమృద్ధి యోజన (SSY) – 8.2%
• సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) – 8.2%
• నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) – 7.7%
• కిసాన్ వికాస్ పత్ర (KVP) – 7.5%
• 5 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ – 7.5%
• మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) – 7.4%
• పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – 7.1%
• 3 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ – 7.1%
• 2 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ – 7.0%
• 1 ఏడాది పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ – 6.9%
• 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD) – 6.7%
• పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ – 4.0%
ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్, మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ రేట్లను సమీక్షిస్తుంది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 31 వరకు పెట్టుబడిదారులకు ఎలాంటి తగ్గుదల లేకుండా మునుపటి లాభాలే కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!