Rainbow Meadows : ఏకంగా ప్రభుత్వ భూమిలో విల్లాలు.. రెయిన్‌బో మెడోస్ స్కామ్..!
- సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో రియల్ మోసం
- రెయిన్ బో మెడోస్ నిర్మాణ సంస్థ కుచ్చుటోపీ
- ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి విక్రయం
- 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు అధికారుల గుర్తింపు
- న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainbow Meadows : సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్‌బో మెడోస్ నిర్మాణ సంస్థ పాల్పడిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ మోసం తాజాగా వెలుగు చూసింది. హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌గా నమ్మించి, పలు సర్వే నంబర్లలో ఏకంగా 40 విల్లాలను అక్రమంగా నిర్మించి అమాయక ప్రజలకు విక్రయించారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విల్లాలన్నీ సర్వే నంబర్లు 198, 199, 204, 208, 210లలోని ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విల్లాల కోసం ఒక్కో కుటుంబం రూ. 90 లక్షల నుంచి రూ. 1.1 కోటి వరకు వెచ్చించింది. మొత్తంగా, బాధితులు సుమారు రూ. 40 కోట్లకు పైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మోసం వెలుగులోకి రాగానే, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనే కొందరు బాధితులు అనుమానం వ్యక్తం చేసినప్పుడు, ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే తాము తీసుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రెయిన్‌బో మెడోస్ సంస్థ లిఖితపూర్వక ఒప్పందం (MOU) ఇచ్చింది. అయితే, ఇప్పుడు అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారణ కావడంతో, నిర్మాణ సంస్థ స్పందించకుండా ముఖం చాటేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Also Read
తమ ఇళ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు తేలడంతో, హెచ్‌ఎండీఏ, ఎంఆర్ఓ, ఆర్‌డిఓ వంటి ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వ భూమిని తనిఖీ చేయకుండా ఈ నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చాయని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ, సంస్థ భాగస్వాములైన ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్, ఎన్.వి. నరసింహారావులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తమకు అయిన నష్టాన్ని పూర్తిగా తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం, బాధితులు అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో, బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది.
Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!