హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో జ్యోతిబాపూలే సావిత్రిబాయి- ఆచార్య జయశంకర్ విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. త్యాగ దాతల విగ్రహాలు చూసినప్పుడు వారు చేసిన పోరాటాలు గుర్తు చేసుకోవాలి.. నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు నందమూరి తారక రామారావు అయితే, ఇంకొకరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారేమో..!
సీఎం కేసీఆర్ దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పిచ్చి గాడిద కొడుకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లక్షలు లక్షలు తిన్నారు అని విమర్శిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను గెలిచిన నాలుగు సార్లలో మహిళలు లోటలు పట్టుకొని 4 గంటలకు చెట్ల సాటుకు పోయేది.. ఇప్పుడు 6 గంటలకు లేస్తాండ్లు అని మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ చేశాడు.
Read Also: Pregnancy Diet: బిడ్డ ఎదుగుదల కోసం గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు..
ఇక మొన్న చేసిన సర్వేల్లో కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్టే చేసిండ్లు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక వాళ్ళ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ అనగానే 25 సీట్లకు వచ్చేది పోయింది.. కేసీఆర్ రుణమాఫీ అనగానే మొత్తం పోయింది.. ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేసి గెలిచేందుకు చూస్తున్నాయని ఆయన విమర్శించారు.