రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా జరుపుతుందని ఆయన వెల్లడించారు. ఆత్మ గౌరవం కోసం సర్వాయి పాపన్న పోరాటం చేశారు.. 10 మందితో మొదలైంది ఆయన సైనం, చివరగా గోల్కొండ కోటపై జెండా ఎగుర వేసారు.. తెలంగాణ పోరాటం కూడా అదే విధంగా జరిగింది.
Read Also: Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన
జిల్లా గౌడ సంఘం కోసం 2 ఎకరాల స్థలంను అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సంఘ భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామన్నారు. ఇది మీ ప్రభుత్వం.. మీ ఆశీర్వాదం తో ఇక్కడ ఉన్నాం.. కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం.. 4 కోట్ల మందికి కేసీఆర్ కుటుంబ పెద్దగా ఉంటున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లా లోనే మొదటి సారిగా సెప్టీగా మోకులు అందిస్తామన్నారు. పని చేసే ప్రభుత్వం మాది.. 55 ఏళ్ల కరెంట్, సాగునీరు, కోసం ఇబ్బంది పడ్డామన్నారు అని ఆచప తెలిపారు. సిరిసిల్లలో బోటింగ్ లంచ్ ఓపెన్ చేయడంతో పాపికొండలు లాగా తయారీ అయింది.. మల్కపేట నుంచి సింగ సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి.. శాశ్వతంగా 365 రోజులు నీళ్ళు ఉండేలా చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
Read Also: Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్
సీఎం కేసీఆర్ కృషితో గోదావరి జలాలు వచ్చాయి.. ఈత వానలు, తాటి వానలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. టాటా బిర్లా కాదు తాతల నాటి కుల వృత్తులు బాగుండాలి.. 1001 గురుకుల పాఠశాలలు అయ్యాయి.. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందిసున్నాం.. నీరా సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం.. తర్వాత సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేస్తాం..
మీరు ఆదరించాలి, మీకు ఏదైనా చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.