నేడు నూతన కోర్టు భవనాలు ఆరంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ధరజ్ సింగ్ పాల్గొననున్నారు. పలువురు న్యాయమూర్తులు కూడా పాల్గొననున్నారు. నేడు విశాఖలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించనున్నారు. పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో సమవావేశాని హాజరుకానున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో నేడు ఏడోవ రోజు. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారంతో ముగియనున్న…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు అందించింది. యూజీసీ ఎరియర్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు డీఎంఈ పరిధిలో పని చేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ. 350 కోట్లు పెట్టుబడిని పెట్టనుంది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం దాదాపు రూ. 350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయింది.
కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా చేసుకుని ఎక్కడైనా అలాంటి నిర్ణయం జరిగినా నిరాశ పడవద్దు అని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీలుగా, ఇతరత్రా పదవులు ఇచ్చే విధంగా నేరుగా పార్టీ అధిష్ఠానం నుంచి హామీ ఉండేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చాడు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అంతకు ముందే.. అనగా.. సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన తెలంగాణకు వస్తున్నారు.
గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Vande Bharat Express: భారత రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హైస్పీడు రైళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
గ్రూప్-1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం అని అన్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గత ఐదు గంటలుగా విచారిస్తున్నారు. దేవరకొండ సురేష్, రామచంద్రలతో పరిచయాలపై నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.