తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం రెడీ అయింది. కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ప్రచార రథం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.
Read Also: Congress Candidate List: తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
అధికార బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను చూపిస్తు.. ప్రతిపక్షాలను షాకిస్తుందని అందరు భావిస్తున్నారు. కాగా, నేడు తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి-ఫారాలను అందిస్తారు. రానున్న ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు రైతు రుణమాఫీ లాంటి గత హామీలను పరిగణనలోకి తీసుకుని కొత్త హామీలను మేనిఫెస్టోలో రూపొందించినట్లు తెలుస్తుంది.
Read Also: Congress First List: నాలుగో సారి భట్టి.. ఆరో సారి పోటీ చేస్తున్న పొదెం వీరయ్య
ఇదే, సమయంలో హుస్నాబాద్ వేదికగా నేడు జరుగనున్న ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల ప్రచార రథం కూడా రెడీ అయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో గులాబీ బాస్ ఫోటో, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగుతో రెడీగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
Read Also: Kajal Aggarwal: చిలిపి పోజులతో మురిపిస్తున్న కాజల్ అగర్వాల్..
గత కొద్ది రోజుల క్రితం యూపీ నుంచి తెలంగాణాకు ఈ ప్రచార రథం చేరుకుంది. నేటి (ఆదివారం) నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ఈ ప్రచార రథం పరుగులు పెడుతుంది. ఇవాళ హుస్నాబాదుకు ఈ ప్రచార రథం చేరుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కేసీఆర్ తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనేలా జాబితాను రెడీ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లతో పాటు ఈసారి హైదరాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. బీఆర్ఎస్ మరో సీనియర్ లీడర్ హరీశ్ రావు సైతం ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.