BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ…
Special Focus On Telangana: తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే వలసల పర్వం షురూ అయింది.టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది.చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి..రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే..ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఊపందుకుంది టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర…
సభలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు.
బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.