తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ సుధీర్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయగా.. జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది.
భారత రాష్ట్ర సమితి రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.
ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఎక్కువగా ఉపయోగపడే ఆధార్ కార్డు.. తప్పిపోయిన వికలాంగ బాలుడిని దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి ఉపయోగపడింది. 2015లో తప్పిపోయిన హైదరాబాద్ బాలుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది ఆధార్ టీమ్.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, Telangana Elections 2023, Telangana Assembly Elections, National News, International News
School Holidays: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నవంబర్ 30వ తేదీన తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.