నేడు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి రోజు. దీంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ బరిలో నిలిచేదెవరో ఇవాళ ఖరారు కానుంది. ఇక, నామపత్రాల పరిశీలన అనంతరం 2898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తలను అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం చోటు చేసుకుంది.. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే కడతేర్చింది భార్య.. పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటకు…
ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు.