School Holidays: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నవంబర్ 30వ తేదీన తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలకు ముందురోజు మధ్యాహ్నం నుంచే ఉద్యోగులు చేరుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎంలను సేకరించేందుకు ఉపాధ్యాయులు నవంబర్ 29న ఉదయం 7 గంటలలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
అందుకే నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఓటింగ్ ముగిసి ఈవీఎంలను ఆయా కేంద్రాలకు తీసుకెళ్లి సేకరించే సమయానికి అర్ధరాత్రి అవుతుంది. అందువల్ల ఓటింగ్ డ్యూటీలో పాల్గొనే ఉపాధ్యాయులకు డిసెంబర్ 1న సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్ , తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్ టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లుకు వినతిపత్రం సమర్పించారు.
YSRCP Samajika Sadhikara Bus Yatra: నేటి నుంచి రెండో దశ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర