బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు రాజ్యసభ ఛైర్మన్ బిగ్ షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సభలో రూల్స్‌కు విరుద్ధంగా ఫ్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో తదుపరి చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. సీనియర్ నేతలు కే.కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలతో పాటు వడ్డీరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, దామోదర్ రావులు నోటీసులు అందుకున్నారు.
Read Also: America: బైడెన్ మనవరాలికి భద్రతా లోపం.. కాల్పులు జరిపిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు హౌస్‌లో నిరసనలు తెలుపుతూ.. ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు కంప్లైంట్ చేశారు. ఇక, బీజేపీ ఎంపీ ఠాకూర్ కంప్లైంట్‌ని పరిగణలోకి తీసుకున్న ఛైర్మన్ సదరు ఎంపీలకు నోటీసులు ఇచ్చారు.