తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై..…
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని వీడియో సందేశంలో తెలిపారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నాని అన్నారు.
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు నేడు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
Wines Closed for Next 3 Days in Telangana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం…
Telangana Elections: రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తుతున్న అభ్యర్థుల మైకులు మూగబోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు బయలు దేరారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) రైతు బంధు పథకం కింద డబ్బు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో 2023లో కూడా 2018 పునరావృతం కాగలదని ఆశించింది. ఇది ఎన్నికల ఫలితాలను నడిపిస్తుందని.. భారీగా ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.