These precautions are mandatory for voters: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. గురువారం (నవంబర్ 30) తెలంగాణలో పోలింగ్ డే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు వేసే ప్రాసెస్ ఏంటి?, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఓసారి తెలుసుకుందాం. గుర్తింపు కార్డు తప్పనిసరి:…
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇలా ఘర్షణకు తెరలేచింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో డబ్బుల డంప్ ఉందనే సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీమ్‌తో పోలీసులు సోదాలు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ దగ్గర డబ్బులు లేవని…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు.
కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది.
దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు.