Cm Revanth Reddy Launches: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుందని అధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి రూ.10 లక్షలకు రేవంత్ రెడ్డి సర్కార్ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది.
Read Also: KCR Health News: ఆపరేషన్ తర్వాత కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన డాక్టర్లు..
తెలంగాణ రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందించబోతున్నారు. 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం కింద 1,376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.