Telangana Assembly Session : ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త స్పీకర్ ఎన్నిక నేడు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉండనున్నారు.
అయితే, ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక, దీనిపై బీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదటి రోజు మాత్రం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడే ఛాన్స్ ఉంది. తిరిగి సమావేశాలు ఈనెల 13 నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చిస్తారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ రిలీజ్ కానుంది. ఈ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన అయిన తర్వాత.. సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.