తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది.
నేడు గాంధీభవన్‌లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియో జకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది.
Revanth Reddy: ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీలను రద్దు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్ పనులు జరుగుతున్నాయన్నారు.
Top Headlines @9PM on 1st January 2024, Top Headlines @9PM, telugu news, top news, new year celebrations, Telangana, Andhrpradesh, National News, Tollywood Sports